గుంతకల్లు: బసినేపల్లి శివారులో మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగి మహిళ ఆత్మహత్యాయత్నం, ఆస్పత్రికి తరలింపు
గుత్తి మండలం బసినేపల్లి సమీపంలో భారతి అనే మహిళ మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బళ్లారికి చెందిన భారతి గత రెండు రోజుల క్రితం జొన్నగిరి వద్ద వజ్రాల వేటకు వచ్చింది. అయితే ఏ కారణం చేతనో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రి పాలైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.