చీమకుర్తి పట్టణంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించే ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చీమకుర్తి ఎంపీడీవో రాఘవేంద్ర పిలుపునిచ్చారు. చీమకుర్తి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ప్రపంచ ధ్యాన దినోత్సవానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఎంపీడీవో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ధ్యాన ప్రయోజనాలను వివరించేందుకై ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించు ధ్యాన కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.