మేడ్చల్: బోడుప్పల్ లో 29వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమం
బోడుప్పల్ లో 29వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువు తప్ప క్రీడలను ప్రోత్సహించి ఆస్కారం లేకుండా పోయింది అని అన్నారు. ఉదయాన్నే లేచి గంట రెండు గంటల పాటు ట్రైనింగ్ పొందడం అనేది మామూలు విషయం కాదని అన్నారు. పిల్లలంతా సెల్ ఫోన్లో ఆడుకుంటున్న ఈ రోజుల్లో క్రమశిక్షణగా జీవించాలి, మనకు మనం రక్షించుకోవాలి అని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించి మంచి ఆరోగ్యవంతమైన విద్యార్థులు తీర్చిదిద్దడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గెలిచిన ఓడిన స్పోర్