కళ్యాణదుర్గం: అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కుందుర్పి తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన సీపీఐ నాయకులు
కుందుర్పి మండలం తో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి శివలింగప్ప, సహాయ కార్యదర్శులు గోపాల్, శామ్యూల్ తదితరులు గురువారం కుందుర్పి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లారు. తహశీల్దార్ ఓబులేసుకు అన్ని మండలాలను కరువు మండలాలు ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు.పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.