తెలుగువాడివై పుట్టినందుకు మట్టి లో కలిసే లోపు ఏదో ఒకటి చెప్పుకునే విధంగా సాధించాలని సనాతన ధర్మ పరిరక్షకుడు రాధా మోహన్ దాస్ అన్నారు. కార్తిక మాసం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా గిద్దలూరులో దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాధా మోహన్ దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధా మోహన్ దాస్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యాలు చేసి పుణ్యం దకించుకోవాలని ఎప్పటికైనా మట్టిలో కలిసే వాళ్ళమని ఆలోపు ఏదో ఒకటి సాధించాలని మాట్లాడుతూ చమత్కరించారు.