నంద్యాల జిల్లా రుద్రవరం కొలిమిగుండ్ల సంజామల తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో వేప చెట్లు ఎండిపోవడం కలవరపెడుతుంది, సాదారణంగా ఎండాకాలంలో ఎండి వర్షాకాలంలో చెట్లు చిగురిస్తాయి, అయితే ప్రస్తుతం ఎండలు లేకపోయినా చలికాలంలోనే వేప చెట్లు ఎండిపోతున్నాయి, రహదారులు, పొలాల గట్లు, నివాస ప్రాంతాల్లో వేప చెట్ల ఆకులు రాలి,కొమ్మలు ఎండిపోతుండటంతో పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు