గంజాయి మత్తులో ఉన్న యువకుడు మరో యువకుడిపై బీరు బాటిల్ తో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి జన చైతన్య కాలనీకి చెందిన సుభహాన్ అనే ఏసీ మెకానిక్ యువకుడిని బాబి అనే యువకుడు గంజాయి మత్తులో బీర్ బాటిల్ తో దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన తల్లిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.