సంగారెడ్డి: కొత్త బస్టాండ్ ముందు జేఏసీ ఆందోళన, నిరసన ర్యాలీ నిర్వహించిన బీసీవిద్యార్థి సంఘం నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆందోళన చేపట్టారు. నిరసనకారులు కొత్త బస్టాండ్ ముందు బయట నుంచి వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బస్టాండ్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు