హిమాయత్ నగర్: నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు
నాంపల్లి లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఉధృతికత చోటు చేసుకుంది.గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు తెలంగాణ జాగృతి నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.