అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుత్తి మండలం పూలకుంట గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన నాగార్జున అనే వ్యక్తి చికిత్స పొందుతూ నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.