గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని కుసుమహరనాధ స్వామి ఆలయం ఆవరణలో స్త్రీ శక్తి వరం కార్యక్రమం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కుసుమహరనాధ స్వామి ఆలయం ఆవరణలో శ్రీ పరంజ్యోతి సేవాసమితి శ్రీ సౌజన్య దాసాజి ఆధ్వర్యంలో శ్రీ పరంజ్యోతి శ్రీ శక్తి వరం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ సెన్సార్ బోర్డు సభ్యురాలు మరియు ప్రముఖ గాయని అరుణ సుబ్బారావు హాజరయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని దాదాపు 850 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సౌజన్య దాసాజీ మహిళలకు ప్రస్తుతం సామాజిక స్పృహ, ఆత్మాధిక అంశాలపై పలు అంశాలను బోధించారు. స్త్రీ శక్తి ప్రస్తుతం సమాజంలో స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత వంటి అంశాలపై వివరించి మహిళలను చైతన్యపరిచారు.