ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లో ఆదివారం రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు దొంగతనాలు అరికట్టే అంశంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ అనుమానస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనాలు అరికట్టే అంశంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.