భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఓటు షేరింగ్ జరిగింది
- సూళ్లూరుపేటలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
భారతదేశంలో 2024 లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో అనేక రాష్ట్రాలలో ఓటు షేరింగ్ జరిగిందని ఏఐసీసీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాల గురవం బాబు ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషనర్ ను, పోలీస్ సిబ్బందిని, అధికారుల సహకారంతో ఓటు షేరింగ్ చేసి అధికారంలోకి వచ్చారని బాల గురవం బాబు అన్నారు. భారతదేశంలో ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా ఆవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మావుడూరు వెంకటాచలపతి ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి బజారు వీధుల మీదుగా నినాదా