ప్రజల నుంచి 66 అర్జీలు స్వీకరించిన ఎస్పీ సతీష్ కుమార్
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం 66 వినతులు అందినట్లు ఎస్పి సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన లక్ష్యమన్నారు. ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, సైబర్ నేరాలు అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరం న్యాయం చేస్తామన్నారు.