కొడంగల్: ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మన్నెగూడ పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు
జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నేడు మంగళవారంవికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్ఐ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ భరత్ రెడ్డి మాట్లాడుతూ.. పెనాల్టీ ఉన్న వాహనదారులు వాహనాల పాత పెనాల్టీలను చెల్లించాలన్నారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన పత్రాలను వాహనాలలో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.