ప్రకాశం జిల్లా సింగరాయకొండ-కందుకూరు రూట్‌కి ఆర్టీసీ బస్సులు సరైన సమయంలో లేక ప్రయాణికులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న కొన్ని సర్వీసులు సరిపోక ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువవుతోంది. మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తుండటంతో రద్దీ పెరుగుతుంది. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టి బస్ సర్వీసులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.