నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
Nirmal, Nirmal | Sep 16, 2025 నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని అటవీ శాఖ అధికారులు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాలను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది నజీర్ ఖాన్, సంతోష్, వెన్నెల, సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.