సంగారెడ్డి: విద్యార్థులు సివిల్స్ లక్ష్యంగా చదవాలి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య
విద్యార్థులు సివిల్స్ సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకొని చదవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని జేఎన్టీయూ కేరేర్ గైడెన్స్ పై అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సివిల్స్ అనేది ఓ ఉద్యోగం కాదని, దేశ సేవ అని చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదలతో పరీక్షకు సన్నద్ధం అయితే తప్పకుండా విజయం సాధిస్తారని పేర్కొన్నారు.