పలమనేరు: నిర్మాణంలో ఉన్న అర్చక స్వామి ఇంట్లో చోరీ, దొంగలు ఏమి దోచుకెళ్లారో తెలిస్తే అవాక్కవుతారు
పలమనేరు: పట్టణంలోని రాధా బంగ్లా ఏరియాలో పలమనేరు పాతపేట శ్రీ కనకదుర్గమ్మ గుడి అర్చకులు గోపి స్వామి తెలిపిన సమాచారం మేరకు. తాను నిర్మిస్తున్న నూతన గృహంలో కరెంటు వైర్లు చోరీకి గురయ్యాయి. గత మార్చి నెల లో ఒకసారి ఇలాగే వైర్లు చోరీ జరిగితే, అదే వీధిలో గల నిందితులు సాయి, సంజయ్, గణేశ్ ల నుంచి పోలీసులు వైర్లను రికవరీ చేశారు. ఇప్పుడు దాదాపుగా రూ.1.20 లక్షలు విలువచేసే ఎలక్ట్రిక్ వైర్లు, విద్యుత్ సామాన్లు దుండగులు దొంగిలించారని బాధితుడు తెలిపారు, పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యన రాధా బంగ్లా ఏరియాలో ఎక్కువగా చోరీ కేసులు నమోదవుతున్నాయి పోలీసులు నిఘా పెట్టాలన్నారు.