పులివెందుల: వేంపల్లిలో ప్రమాదకరంగా ఉన్న గుంతలను వెంటనే పూల్చండి, R&B EE మాధవి
Pulivendla, YSR | Oct 27, 2025 కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పులివెందుల రోడ్డు, కడప రోడ్డు గుంతలతో అద్వానంగా తయారయింది. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్ అండ్ బి ఈఈ మాధవి వెంటనే ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూంచాలని సంబంధిత కాంట్రాక్టర్ కు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆమె పరిశీలించి.. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని చెప్పారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు పనులు చేపట్టాలని సూచించారు.