తాడిపత్రి: తాడిపత్రిలో రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేశారు. జేసీ నివాసంలో ఒకటో వార్డు లబ్ధిదారులకు కొత్తగా తయారైన కార్డులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కొత్త పథకాలు తీసుకొస్తోందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సోమశేఖర్, డీటీ మల్లేశ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.