గాజువాక: ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకూ పోరాడతా - స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు
కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి వీధిలోకి తీసుకునేంతవరకు తమ పోరాటన్ని నిరంకుశంగా కొనసాగిస్తూనే ఉంటామని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ప్రతినిధులు నమ్మి రమణ మంత్రి రవిలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కాంట్రాక్ట్ కార్మికులు ఎంతగానో కృషి చేశారని వారిని కాదని కొత్తవారిని వీధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. ఈ చర్యలు అడ్డుకోవటానికి గత ఆరు రోజులుగా పోరాటం జరుపుతున్నామని భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తామని తెలిపారు.