రాయదుర్గం మండలం మల్లాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద నవ నాగుల వద్ద సుబ్రహ్మణ్యం షష్టిని బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలయ్ కమిటీ గౌరవ అధ్యక్షులు రామ్మూర్తి స్వామీ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీలక్ష్మి సమేత నరసింహస్వామికి, నవనాగుల విగ్రహాలకు సుప్రభాత సేవ పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. సుబ్రహ్మణ్యం షష్ఠిలో బాగంగా పంచామృతాభిషేకం పుష్పాలంకరణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు.