కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు
వాల్మీకిపురం మండలం కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.ప్రకాష్ ఆధ్వర్యంలో మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయుల సమక్షంలో సోమవారం అథ్లెటిక్స్ అండర్ 14 మరియు 17 విభాగంలో రన్నింగ్ రేస్,షాట్ పుట్,డిస్క్ త్రో వంటి పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి మండల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రమేష్ మరియు క్రీడలలో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు మోమెంటోలు మెడల్స్ ను బొజ్జ కృష్ణప్ప మరియు ప్రధానోపాధ్యాయులు వి.ప్రకాష్ బహుకరించారు. హెచ్ ఎం వి.ప్రకాష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగడం వలన పిల్లల్లో మానసిక శారీరక అభివృద్ధి జరుగుతుందని అన్నారు