సంగారెడ్డి: క్రీడలను ప్రోత్సహించండి: మెదక్ ఎంపీ రఘునందన్ రావు
జిల్లా స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మేరకు పటాన్చెరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2026 వరకు కోచ్ లు విద్యార్థులను క్రీడలపై ఆసక్తిని పెంచి ప్రోత్సహించి మంచి మెడల్స్ సాధించే రీతిలో కృషి చేయాలని తెలిపారు. అలాగే జిల్లా యంత్రాంగం కూడా క్రీడలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.