పురమిత్ర యాప్ ను సద్వినియోగం చేసుకోండి: బేతంచెర్ల నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్
Dhone, Nandyal | Oct 21, 2025 ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పురమిత్ర యాప్‌ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బేతంచెర్ల నగర పంచాయతీ కమిషన్ హరిప్రసాద్ సూచించారు. మంగళవారం నగర పంచాయతీ కార్యాలయంలో గ్రామ సచివాలయ, మెప్మా, అడ్మినిస్ట్రేషన్ సిబ్బందికి పురమిత్ర యాప్‌పై కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా వివిధ రకాల సేవలు, చెల్లింపులు, ఫిర్యాదులు కూడా చేయవచ్చన్నారు.