జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కంభం సర్కిల్ పరిధిలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మూడు బృందాలుగా ఏర్పడి మంగళవారం వాహన తనిఖీలు చేపట్టినట్లు సర్కిల్ సీఐ మల్లికార్జున మీడియాకు తెలిపారు. ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాలను పాటించినట్లు ఆయన వెల్లడించారు. వాహన సంబంధిత ధ్రువపత్రాలు చెక్ చేయడంతో పాటు డ్రైవర్ కు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. మీడియాతో మల్లికార్జున మధ్యాహ్నం నాలుగు గంటలకు మాట్లాడారు.