కర్నూలు: కుమ్మరి శాలివాహన కులస్తులకు రాజకీయంగా పెద్ద పీట వేయాలి: శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర
కుమ్మరి శాలివాహన కులస్తులకు రాజకీయంగా రావాల్సిన పదవులు రాజకీయ పార్టీలు కేటాయించాలని శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర కర్నూలు లో అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు శాలివాహన సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా వారు కర్నూలు లోని బీసీ భవనం నందు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కుమ్మరి శాలివాహన కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారని జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో పదవులను అన్ని రాజకీయ పార్టీలు కెటాయించాలని కోరారు.