నారాయణ్‌ఖేడ్: రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సందీప్ కి కల్హేర్‌లో అంత్యక్రియలు పూర్తి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహబూబ్ సాగర్ చెరువు వద్ద రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సందీప్ కి స్వగ్రామం కల్హేర్‌లో అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ డిఎస్పి వెంకటరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి తల్లిని ఈ సందర్భంగా ఓదార్చారు. అంత్యక్రియలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.