రేణిగుంట తూకివాకం పంచాయతీ కార్యాలయం వద్ద మహిళల నిరసన
తూకివాకం పంచాయతీ వద్ద మహిళల నిరసన రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం పంచాయతీ పరిధిలోని 4 గ్రామాలకు చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. సీబీఐడీ కాలనీ సమీపంలోని సర్వే నంబర్ 30లో ఉన్న ఇస్మాయిల్ స్థలం కబ్జాకు గురవుతోందని, ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. సీపీఐ నేత పి.ఎల్. నరసింహులు మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలోని నిరుపేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.