తాడికొండ: రాజధానిలో పట్టిపీడిస్తున్న కాల నాగులు..
రాజధానిలో పట్టిపీడిస్తున్న కాల నాగులు తుళ్ళూరులో కాల నాగులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని బాధితుడు పేరం భాస్కరావు అన్నారు. ఆయన విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ, తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదే సమయంలో తన రెండున్నర సెంట్లు నివాసం ఉండే ఇంటి పత్రాలు పెట్టి నేలపాటి చందు దగ్గర 3 లక్షలు బాకీ తీసుకున్నాడు. వడ్డీ, అసలు కట్టిన కూడా ఇంటి పత్రాలు ఇవ్వడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య శరణ్యం అని ఆవేదన చెందుతున్నాడు.