నల్గొండ: జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా రోడ్లు భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్గొండ లో వచ్చే ఎన్నికల్లో 100% కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 2 వేల మెజార్టీతో లిల్లీపుట్ గెలిచాడని, రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పై కామెంట్ చేశారు. అభివృద్ధిలో నల్గొండ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.