ములుగు: ప్రేమ్ నగర్ స్టేజి వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మరొ ద్విచక్ర వాహనం, ఒకరు మృతి
Mulug, Mulugu | Sep 14, 2025 రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్ స్టేజి వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని నేడు ఆదివారం రోజున రాత్రి 8 గంటలకు మరొక ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామానికి చెందిన యువకునికి తీవ్రగాయాలు కాగా ములుగు జనరల్ హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.