పులివెందుల: పార్నపల్లి వద్ద ఉన్న PBC రిజర్వాయర్ ను పరిశీలించిన తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ మా రెడ్డి జోగిరెడ్డి
Pulivendla, YSR | Oct 27, 2025 మొంథా తుఫాను ముప్పును దృష్టిలో ఉంచుకుని, తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి  ఈ రోజు పార్నపల్లె వద్ద ఉన్న పీబీసీ  రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ ముందస్తు చర్యల్లో జలవనరుల శాఖ అధికారులు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జోగిరెడ్డి మాట్లాడుతూ..  మొంథా తుఫాను ముంచుకువస్తున్న తరుణంలో, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం అని చెప్పారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నారు.