కుప్పం: కుప్పం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ లో పారిశుద్ధ్య పనులు
కుప్పం బైపాస్ రోడ్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్లపై మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బ్రిడ్జిపై ఉన్న వాకింగ్ ట్రాక్ వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడంతో సిబ్బంది క్లీనింగ్ పనులు చేపట్టారు. ఇప్పటికే బ్రిడ్జిపై విద్యుత్ దీపాలతో పాటు కలర్ లైట్లు ఏర్పాటు చేశారు. వాకింగ్ చేసేవారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు సిబ్బంది వెల్లడించారు.