అసిఫాబాద్: ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కార్మికుల తొలగింపు అన్యాయం
ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహం పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ పార్ట్ టైం వర్కర్లను తొలగించడం తొలగించడం అన్యాయమని సిఐటియు నాయకులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ పార్ట్ టైం వంట కార్మికుల జీతాలను తగ్గించద్దని, టైం స్కేల్ ప్రకటించాలని,శ్రమ దోపిడీకి గురి చేయొద్దని డిమాండ్లతో గత 32 రోజులుగా సమ్మె చేస్తుంటే ఉట్నూర్ ఐటిడిఏ పిఓ సమ్మె విషయము తమకు తెలియదు అంటూ అసత్యాలను ఉత్తర్వులో పేర్కొంటూ కార్మికులను తొలగించడం అన్యాయమని అన్నారు.