కొండపి: కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఆయన శనివారం తన కార్యాలయంలో మాట్లాడారు. ఇటీవల వైసీపీ విభాగానికి చెందిన విద్యార్థి నాయకులు విశాఖపట్నం వద్ద గంజాయితో పట్టుబడ్డారన్నారు. వలస వచ్చిన నాయకుడు ఎప్పుడో ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ఏదో ఒక మాట అని వెళ్లడం కాదన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.