శ్రీకాకుళం: నరసన్నపేట లో రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకం ప్రవేశ పెట్టడంతో తాము అప్పుల పాలవుతున్నామని ఆటో మ్యాక్సీ డ్రైవర్లు ఆందో ళన
రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకం ప్రవేశ పెట్టడంతో తాము అప్పుల పాలవుతున్నామని ఆటో మ్యాక్సీ డ్రైవర్లు ఆందో ళన వ్యక్తం చేశారు. బుధవారం నరసన్నపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ.. వాహన మిత్ర పేరిట ప్రభుత్వం తమకు రూ.30 వేలు అందించాలని డిమాండ్ చేశారు. శక్తి పథకం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, వాహనాలకు వాయిదాలు కూడా చెల్లించలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.