ఆందోల్: మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ రవీందర్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట పట్టణంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతిన జోగిపేట పట్టణంలో ఇటువంటి జీవహింస జరగకూడదని అన్నారు. అంతే కాకుండా ఎవరైనా దుకాణదారులు మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు.