గొడుగుపేట వేంకటేశ్వరస్వామి భూములపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఆరోపణలను ఖండించిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
Machilipatnam South, Krishna | Sep 14, 2025
ఆలయ భూములపై ఆందోళన వద్దు: మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూములపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆదివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం టిడిపి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మిడియా కు తెలిపారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు గాను 56 రోజుల పాటు రూ.45 లక్షలకు సదరు భూములను లీజుకు తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో కూడా మరింత ఆదాయం దేవస్థానానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ భూములపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఆరోపణలను కొల్లు తీవ్రంగా ఖండించారు.