పెద్దారవీడు మండలం తంగిరాల పల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డు త్రాగునీటి బోరు నీళ్ల ట్యాంకి ఎరిక్షన్ బాబు రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.