కళ్యాణదుర్గం: కంబదూరులోని కమల మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు
కంబదూరు మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ కమల మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంతరి చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.