చింతవరం సమీపంలో గొఱ్ఱెల మందపైకి దూసుకెళ్లిన లారీ , 10 గొర్రెలు మృతి...
తిరుపతి జిల్లా , చిల్లకూరు మండలం, చింతవరం సమీపంలో గొర్రెల మందపై గ్రావెల్ లారీ దూసుకెళ్లింది. మేఘ కంపెనీకి చెందిన గ్రావెల్ లారీ మద్యం మత్తులో అధిక లోడ్ తో వెళుతూ, గొర్రెల మందను ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందగా , మరో 10 గొర్రెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ని కంపెనీ ప్రతినిధులు అక్కడనుండి తప్పించారు. ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్తులు లారీని ఆపేసి ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు లారీలను కదలనివ్వమని గ్రామస్తుల నిరసన చేపట్టారు.