గజపతినగరం: స్వస్థనారి - స్వశక్తి పరివార్ పై సెప్టెంబర్ 17 నుంచి కార్యక్రమాలు : గంట్యాడలో పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ హేమలత
కంచెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు స్వస్థనారి- స్వ శక్తి పరివార్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని మంగళవారం మధ్యాహ్నం గంట్యాడ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హేమలత తెలిపారు. ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యకరమైన కుటుంబం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.