జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్ లో రెండు బస్సులు ఢీకొనడంతో మహిళకు గాయాలు
తుని డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్‌లోకి వస్తుండగా, అక్కడ అప్పటికే నిలిచి ఉన్న ఏలేశ్వరం డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ వెనక వస్తున్న బస్సులు గమనించకుండా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళనివ్వడంతో తుని బస్సు ఏలేశ్వరం బస్సు వెనుక భాగాలు ఢీకొట్టుకున్నాయి. దీంతో బస్సులో కిటికీ ప్లేస్ లో కూర్చున్న మహిళకు చేతికి గాయాలు తగలగా చికిత్స నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు.