నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తత్తూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు, శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత చల్ల దామోదర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు