కలకడలో స్వామిత్వ సర్వే పారదర్శకంగా జరగాలి: రాయచోటి డిఎల్డిఓ లక్ష్మీపతి
స్వామిత్వ సర్వే పారదర్శకంగా జరగాలని రాయచోటి డిఎల్డిఓ లక్ష్మీపతి సూచించారు. మంగళవారం కలకడ మండల కేంద్రములోని ఎంపిడిఓ కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఇఎ లు, గ్రామ సర్వేయర్లతో ఎంపిడిఒ భాను ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాయచోటి డిఎల్ డిఓ లక్ష్మీపతి హాజరై స్వామిత్వ సర్వే మరియు ఇతర సర్వే ల పనితీరు పై ఆరా తీశారు. సర్వేలను పారదర్శకంగా చేయాలన్నారు. స్వామిత్వ సర్వే చేసే ముందు ఆ ప్రాంతాల్లో గ్రామ ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి సర్వే పారదర్శకంగా చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు