ప్రకాశం జిల్లా సంతనూతలపాడు చీమకుర్తి ప్రాంతాలలో సీఐ దాసరి ప్రసాద్ గురువారం వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ప్రతి వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి వాహనంపై ప్రయాణించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు బలమైన గాయాలు అయితే కలుగు అనర్ధాలను వివరించారు. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు తప్పవని వాహనదాలను సిఐ హెచ్చరించారు.