బేతంచర్ల లో పర్యటించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
Dhone, Nandyal | Nov 2, 2025 బేతంచెర్లలోని కోటపేట, చాకలిపేట, తహసీల్ పేట కాలనీలను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదివారం సందర్శించారు. కాలనీలోని ప్రజలను పలకరించి, ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి పాల్గొన్నారు.