సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. ఆర్ డీ అనురాధ నేతృత్వంలోని బృందం వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.